జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో, వీధి వీధినా గణనాథులను వివిధ ఆకృతులలో ప్రతిష్టించారు. భుక్తాపూర్ కాలనీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బాల గణపతిని చూడటానికి ప్రజలు తరలివస్తున్నారు.
జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో, వీధి వీధినా గణనాథులను వివిధ ఆకృతులలో ప్రతిష్టించారు. భుక్తాపూర్ కాలనీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బాల గణపతిని చూడటానికి ప్రజలు తరలివస్తున్నారు. భుక్తాపూర్ కాలనీలో భవాని గణేష్ మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాల గణనాథుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. చిన్నారులు ఈ బాల గణనాథుడిని చూసి మురిసిపోతున్నారు. ఎంతో ముద్దుగా, ఆకర్షణీయంగా కనిపించే ఈ బాల గణనాథుడిని దర్శించుకోవడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద ఎత్తున గణనాథుడి దర్శనానికి వస్తున్నారు.












