జిల్లా నస్పూర్ గేట్ వద్ద లారీ, ఆటో ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. నిత్యం పనిచేస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న మహిళలు ఈ ప్రమాదంలో బలవ్వడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
మంచిర్యాల మంచిర్యాల జిల్లా నస్పూర్ గేట్ వద్ద లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిత్యం పనిచేస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న ఏడుగురు మహిళలు ఆటోలో కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.
ప్రభుత్వ సహాయం, ప్రగాఢ సానుభూతి
ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాను. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.












