మంచిర్యాల జిల్లాలో అభివృద్ధి పనులపై దృష్టి సారించకుండా, కేవలం సోషల్ మీడియా ప్రచారానికే పరిమితమయ్యారని, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఎంపీ వంశీ విఫలమయ్యారని బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. రైళ్ల నిలుపుదల, ఫ్లైఓవర్ నిర్మాణం వంటి కీలక అంశాల్లో ఎంపీ వైఫల్యం చెందారని ఆరోపించింది.
సోషల్ మీడియా ప్రచారం తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని, సరైన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారని బీజేపీ విమర్శించింది. ప్రజా ప్రతినిధిగా కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఎంపీ వంశీ ఘోరంగా విఫలమయ్యారని, కేవలం ప్రకటనలతో ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ దుయ్యబట్టింది.
మంచిర్యాలలో కేరళ, ఏపీ, యశ్వంత్పూర్ పలు సూపర్ ఫాస్ట్ రైళ్లు నిలుప లేకపోవడంఈ విషయాలను కేంద్రానికి వివరించడంలో ఎంపీ విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. జీపీఎస్ మ్యాప్ ప్రకారం రామగుండం రైల్వే స్టేషన్ కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే, మధ్యలో గోదావరి నది ఉండటంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది, దీనివల్ల దూరం 25 కిలోమీటర్లు పెరుగుతోంది.
హైదరాబాద్కు వాహనాల రాకపోకలకు కూడా 50 కిలోమీటర్ల తేడా వస్తోంది. లక్షల కోట్ల వాహనాల రాకపోకలు, వాటి వ్యయం, సగటు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రానికి వివరించాల్సిన బాధ్యత ఉన్నా ఎంపీ వైఫల్యం చెందారని, రైళ్ల నిలుపుదల విషయంలో కర్తవ్యాన్ని విస్మరించారని ఆరోపణలు వస్తున్నాయి.
జిల్లా కేంద్రంలో 1.30 లక్షల నివాస ప్రాంతం ట్రాఫిక్ తీవ్ర ఒత్తిడితో ప్రజలు సతమతమవుతున్నారని, హైటెక్ సిటీ గాంధీ నగర్ ఫ్లైఓవర్ బైపాస్ రోడ్ అత్యవసరమైనప్పటికీ ఎంపీ ఇప్పటివరకు స్పందించకపోవడం శోచనీయమని అంటున్నారు. పెద్దపల్లి, రామగుండంపై ప్రేమ చూపిస్తూ మంచిర్యాలలపై సవతి ప్రేమ చూపడం, రైళ్ల నిలుపుదల, ఫ్లైఓవర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో జిల్లా వైఖరి, ఆర్డీఎం రాకపోకలను 50 కిలోమీటర్లు తగ్గించాలంటే బైపాస్ రోడ్డు నిర్మించాలని ప్రజల చిరకాల కోరికపై ఎంపీ ఇంతవరకు స్పందించకపోవడం ప్రజలను బాధిస్తోందని కమల నేతలు పేర్కొంటున్నారు.
కేంద్రం తీసుకునే నిర్ణయాలు, బీజేపీ నేతల ప్రతిపాదనలపై ప్రకటన వెలువడిన తర్వాత క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చిత్తశుద్ధితో ఇది పై దృష్టి లేదని విమర్శలు చేస్తున్నారు.










