25 నవంబర్ 26 అక్షరవేకువ (అక్షరవేకువ) నవంబర్ 25
రాష్ట్రంలో మరోమారు కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని, బీఆర్ఎస్ ప్రజాతిరస్కరణకు గురైందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట సభ విజయవంతమైందని, చెన్నూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.
మరోమారు అధికారంలోకి కాంగ్రెస్సే వస్తుందని, ప్రజాతిరస్కరణకు గురైన పార్టీ బీఆర్ఎస్ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శక్తివంతనేతగా రేవంత్ రెడ్డి రాష్ట్రంపై ముద్ర వేశారని, సిద్దిపేట సభ గ్రాండ్ సక్సెస్ అయిందని, ఎన్నికల్లో సిద్దిపేటలో హరీష్ ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ప్రజాపాలనకు అపూర్వ స్పందన లభిస్తోందని తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనతో రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు హస్తం పార్టీ సిద్ధమైందని, చెన్నూరులో 800 పైకోట్లతో అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని చెప్పారు. చెన్నూరులో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, మందమర్రిలో 50 పడకల ఆసుపత్రి పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. చెన్నూరు అసెంబ్లీని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని, మందమర్రి, చెన్నూరు డెవలప్మెంట్ సెంటర్ల పనితీరు అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. సింగరేణి ఓసీపీ గణితం, రామకృష్ణాపూర్ లో 5000 యువతకు ఉద్యోగాలు, జైపూర్ లో 1250 విద్యుత్ ప్లాంట్ పెంపకంతో మరో ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు, ఇతర రంగాల్లో మరో 10 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వ రంగ టాంకామను మెరుగుపరుస్తున్నామని, జపాన్, జర్మనీ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు అపారంగా ఉన్నాయని, రెండు దేశాల్లో పది లక్షల మేర ఉద్యోగాలు కల్పించేందుకు మొదటి బ్యాచ్ 75 యువకులను పంపడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆరు లక్షల ఇందిరమ్మ మహిళలకు ప్రణాళిక రూపొందించగా, ఈ ఏడాది రెండు లక్షల ఇళ్లను మంజూరు చేసిందని, అందులో భాగంగా చెన్నూర్ లోని గంగారం (35), గంగిపల్లి (118) లో ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారని వివరించారు. రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల కల్పనే తమ ఎజెండా అని స్పష్టం చేశారు. గంగిపల్లికి రెండు కోట్ల నిధుల విడుదల చేసి, గోదావరి ప్రక్కన స్మశాన వాటిక ఏర్పాటు చేస్తామని తెలిపారు. గంగారంలో రోడ్ల నిర్మాణం, మరో రెండేళ్ల కాలంలో చెన్నూరు అభివృద్ధికి బంగారు బాట వేస్తుందని తెలిపారు. ప్రతి గ్రామానికి రోడ్డుతో పాటు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. 100 కోట్లతో ప్రతి ఇంటికి అమృత్ పథకం కింద తాగునీటి నల్లా ఏర్పాటు, 100 కోట్లతో బైపాస్ రోడ్, 12 కోట్లతో చెన్నూర్ లో రోడ్ విస్తరణ, అగస్తేశ్వర ఆలయ మరమ్మత్తులు, కేతనపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్, జైపూర్, భీమారావు, చెన్నూరులో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఫలితాలు మరో ఏడాదిలో కార్యరూపం దాల్చుతాయని, పెద్ద ఎత్తున పనులు సాగుతున్నాయని తెలిపారు. కార్మిక శాఖ సంతృప్తినిస్తుందని, తండ్రి వెంకటస్వామి నిర్వహించిన శాఖ తమకు రావడం సంతృప్తినిస్తోందని అన్నారు. ఎంపీ వంశీ సొంత అనుభవంతో అన్ని విషయాలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్లో రాజకీయ విభేదాలకు తావులేదని, తన కుటుంబం గెలుపు ఖాయంగా ఉంటుందనే భావనతో కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు, రేవంత్ రెడ్డి ఆహ్వానంతోనే కాంగ్రెస్లో గెలుపు సాధ్యమైందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం చెన్నూర్, జైపూర్, మందమర్రి పర్యటన అనంతరం మాట్లాడారు.






