హైదరాబాద్, 15 November
ఇండియన్ ఆర్మీకి 170 ఎకరాల భూమిని దానం చేసిన సినీస్టార్ సుమన్‌ను తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమంలో సుమన్‌ను ఘనంగా సన్మానించారు.
ఇండియన్ ఆర్మీకి 170 ఎకరాల భూమిని దానం చేసిన మహనీయుడు, రియల్ హీరో, సినీస్టార్ సుమన్‌ను తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడుతూ, ఇండియన్ కార్గిల్‌లో అమరవీరులైన జవాన్లకు కరాటే బ్లాక్ బెల్ట్, సినీస్టార్ హీరో సుమన్ తన సొంత భూమిలో 170 ఎకరాలను ధారాళంగా దానం చేసిన గొప్ప మహనీయుడు. ఆయన సేవ మరువలేనిది. అమర జవాన్ల కుటుంబాలలో ఆయన సేవ చిరస్థాయిగా నిలిచిపోతుంది. తెలుగు సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్‌తో అద్భుతంగా నటిస్తూ, భక్తి రస చిత్రాలైన అన్నమయ్య, రామదాసు సినిమాల్లో దేవుని పాత్రల్లో, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడి పాత్రల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన అటువంటి గొప్ప మనసున్న మహారాజును ఈరోజు కలవడానికి అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేనేజర్ వెంకట్ వెంకట్రావు, శివ ముక్తేష్, రాజేష్, మిత్రులు పాల్గొన్నారు.







