హైదరాబాద్, 3 November
ఆసియా స్థాయి విద్యా, పరిశోధనా రంగాల్లో ఐఐటీ హైదరాబాద్ మరోసారి తన ప్రతిభను చాటుకుంది. క్యూఎస్ () వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్2027లో ఆసియా విభాగంలో 19 స్థానాలు మెరుగుపరుచుకుని 251వ ర్యాంకును సాధించింది. గత ఏడాది 270వ స్థానంలో నిలిచిన ఐఐటీ హైదరాబాద్ ఈసారి 251వ స్థానానికి చేరుకోవడం విశేషం.
ఆసియా స్థాయి విద్యా, పరిశోధనా రంగాల్లో ఐఐటీ హైదరాబాద్ మరోసారి తన ప్రతిభను చాటుకుంది. క్యూఎస్ () వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్2027లో ఆసియా విభాగంలో 19 స్థానాలు మెరుగుపరుచుకుని 251వ ర్యాంకును సాధించింది. గత ఏడాది 270వ స్థానంలో నిలిచిన ఐఐటీ హైదరాబాద్ ఈసారి 251వ స్థానానికి చేరుకోవడం విశేషం. పరిశోధనా ఉత్పాదకత, అధ్యాపకుల అర్హతలు, విద్యా ప్రతిష్ఠ వంటి అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచి ఐఐటీ హైదరాబాద్ ఈ ఘనత సాధించింది. తాజా ర్యాంకింగ్స్ లో ఐఐటీ హైదరాబాద్ అధిగమించిన విద్యాసంస్థల శాతం 82.5 నుంచి 85.5కు పెరిగింది. సాంకేతిక విద్య, డీప్‌టెక్ పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు ఐఐటీ హైదరాబాద్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థులు, పరిశోధకులు తమ ఆలోచనలను పేటెంట్లుగా, సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలుగా అభివృద్ధి చేసేందుకు ఐఐటీ హైదరాబాద్ ప్రోత్సహిస్తోంది. ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి మాట్లాడుతూ, ఈ విజయం అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు, సిబ్బంది సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. విద్య, పరిశోధనలను సాంకేతికత, ఆవిష్కరణలు, వాస్తవ సమస్యల పరిష్కారాలతో అనుసంధానిస్తూ ఐఐటీ హైదరాబాద్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2008లో ప్రారంభమైన ఐఐటీ హైదరాబాద్ తక్కువ కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఎన్ఐఆర్ఎఫ్2025 ర్యాంకింగ్స్ లో ఇంజినీరింగ్ విభాగంలో ఏడో స్థానం, ఇన్నోవేషన్ విభాగంలో ఆరో స్థానం సాధించింది. క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్స్2027లో 588వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఐఐటీ హైదరాబాద్‌లో 6,110 మందికి పైగా విద్యార్థులు, 355 మందికి పైగా అధ్యాపకులు ఉన్నారు. ఇప్పటి వరకు రూ.1,880 కోట్ల విలువైన 5,980కి పైగా పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులను ఐఐటీ హైదరాబాద్ చేపట్టింది. 850కి పైగా పేటెంట్లు కలిగి ఉండగా, 450కి పైగా పేటెంట్లకు ఐఐటీ హైదరాబాద్ అనుమతులు పొందింది. అలాగే 300కు పైగా స్టార్టప్‌ల ఏర్పాటుకు ఐఐటీ హైదరాబాద్ ప్రోత్సాహం అందించింది. పరిశోధనలు, ఆవిష్కరణలు, నూతన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో నిరంతరం ముందుకు సాగుతూ ఐఐటీ హైదరాబాద్ దేశ విద్యారంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది.











