సంగారెడ్డి, 2026-11-26
సంగారెడ్డి జిల్లాలో పెండింగ్లో ఉన్న చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ఈనెల 21న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నారు.
సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో, జిల్లా పరిధిలోని అన్ని సంబంధిత న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం ( ) సెక్షన్ 138 కింద నమోదైన చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ఈనెల 21వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ జి.భవాని చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, చెక్ బౌన్స్ కేసుల కారణంగా అనేకమంది కక్షిదారులు సుదీర్ఘకాలంగా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు ఖర్చు చేస్తున్నారని, అటువంటి కేసులను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక చక్కటి వేదిక అని పేర్కొన్నారు.
ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా చెక్ బౌన్స్ కేసుల్లో ఇరుపక్షాలకు త్వరితగతిన న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యమని గౌరవ న్యాయమూర్తి తెలిపారు. కావున సంగారెడ్డి జిల్లా పరిధిలోని కక్షిదారులు, ఫిర్యాదుదారులు, నిందితులు మరియు న్యాయవాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, 21వ తేదీన నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విజ్ఞప్తి చేస్తోంది.







