సంగారెడ్డి జిల్లా మండలం ఎద్దుమైలారంలోని ఆయుధ కర్మాగారం (ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ) చీఫ్ జనరల్ మేనేజర్‌గా అనురాగ్ కుమార్ శర్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు చెన్నైలోని ఆవడి ఇంజిన్ ఫ్యాక్టరీలో పనిచేసిన ఆయన, బదిలీపై ఇక్కడికి వచ్చారు.
ఎద్దుమైలారం ఆయుధ కర్మాగారంలో ఇంతకుముందు సీజీఎంగా పనిచేసిన ఎస్.ఎస్.ప్రసాద్ చెన్నైకి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనురాగ్ కుమార్ శర్మ బాధ్యతలు చేపట్టారు. నూతన సీజీఎం బాధ్యతలు స్వీకరించిన అనంతరం, కర్మాగారంలోని వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కర్మాగారంలో జరుగుతున్న ఉత్పత్తి కార్యకలాపాలు, పరిపాలనా వ్యవహారాలు, ఉద్యోగుల సంక్షేమం వంటి కీలక అంశాలపై అనురాగ్ కుమార్ శర్మ అధికారులతో చర్చించారు. భవిష్యత్ ప్రణాళికలపై కూడా ఆయన అధికారులకు సూచనలు అందించినట్లు సమాచారం.












