ఆదిలాబాద్, 13 September
జిల్లాలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీట్లపై దృష్టి సారించిన సర్వేలు ఆసక్తికర ఫలితాలను వెల్లడిస్తున్నాయి. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలున్న జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీకి 3, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి 5, కమలం పార్టీ బీజేపీకి 2 స్థానాలు దక్కే అవకాశం ఉందని సర్వేలు సూచిస్తున్నాయి.
జిల్లాలో సర్వేల ఫోకస్ ముందస్తు సీట్ల వెల్లడి అధికార కాంగ్రెస్కు 3 ప్రతిపక్ష బీ ఆర్ఎస్ 5 కమలం పార్టీ బిజెపికి 2 దక్కే అవకాశం ఉంది సర్వేలు బహిర్గతం చేస్తున్నాయి. మొత్తం జిల్లాలో 10 స్థానాలు ఉండగా అందులో మూడేళ్ల కాంగ్రెస్ పాలన ప్రజా అభిప్రాయాన్ని సేకరించేందుకు సర్వేలు రంగంలోకి దిగాయి శాంపిల్ సేకరణలో 100 లా 10 చొప్పున అభిప్రాయ స్వీకరణ చేపట్టినట్లు సమాచారం అందులో భాగమే స్థానాల ప్రకటింపు చేస్తున్నారు పార్టీలు సైతం సొంతగా తమ అనుచరులతో సర్వేలు చేపడుతున్నట్లు సమాచారం పార్టీలో తీరు నాయకుల పనితీరుపై ఈ సర్వేలు బలం చేకూర్చే విధంగా కొందరికి అనుకూలంగా మరికొందరికి వ్యతిరేక వస్తున్నట్లు తెలుస్తుంది దీంట్లో భాగమే మంచిర్యాల జిల్లాలో సైతం మూడు స్థానాల్లో ఈ సర్వేలపై నేతలకు మక్కువ పెరిగింది ఇటీవల మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సైతం సర్వే వివరాలను బయటపెట్టారు. ఏది ఏమైనా నేతల పనితీరు ప్రదర్శన పార్టీల వ్యవహరింపు కార్యకర్తల మనోభావాలు అనుగుణంగా ఉండేలా కనిపిస్తుంది



