అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయలో 20 ఏళ్ల ఐటీఐ విద్యార్థిని కిల్లో మీనా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మండలం గుంటగన్నెల గ్రామానికి చెందిన మీనా అరకులోయలో ఐటీఐ కోర్సు చదువుతోంది. చొంపి జంక్షన్ సమీపంలోని హైవే బ్రిడ్జి కింద వాగులో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువతి ముఖంపై తీవ్ర గాయాలు ఉండటంతో ఆమెపై దాడి చేసి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని వాగులో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మీనా మృతికి అసలు కారణం పోస్టుమార్టం నివేదిక, పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానుంది. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.




