మంచేరియల్, 2026-11-26
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు బీజేపీ ప్రభుత్వం తగిన గౌరవం కల్పించిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల కృష్ణమూర్తి అన్నారు. అంబేద్కర్ జన్మస్థలం, లండన్‌లో విద్యాభ్యాసం చేసిన ప్రదేశం, బౌద్ధ దీక్ష స్వీకరించిన స్థలం, ఆయన మరణించిన స్థలం, అంత్యక్రియలు నిర్వహించిన స్థలాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేసినట్లు వివరించారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు బీజేపీ ప్రభుత్వం తగిన గౌరవం కల్పించిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల కృష్ణమూర్తి అన్నారు. అంబేద్కర్ జన్మస్థలం, లండన్‌లో విద్యాభ్యాసం చేసిన ప్రదేశం, బౌద్ధ దీక్ష స్వీకరించిన స్థలం, ఆయన మరణించిన స్థలం, అంత్యక్రియలు నిర్వహించిన స్థలాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేసినట్లు వివరించారు. అంబేద్కర్‌కు భారతరత్న పురస్కారం లభించడంలో బీజేపీ ప్రభుత్వం ఆయనకు సముచిత గౌరవం కల్పించిందని పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగ విలువలు, అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల రాజన్న, జిల్లా ఉపాధ్యక్షులు అడ్లూరి దేవేందర్, ఎరుకల నర్సింగ్, రాకేష్ రెన్వా, ఎల్కపల్లి పవన్, జిల్లా కార్యవర్గ సభ్యులు గొర్రె శ్రీనివాస్, ఎల్కటూరు రాజేష్, మంచిర్యాల గర్మిల్లా జోన్ అధ్యక్షుడు ములకల్ల కుమార్, హాజీపూర్ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కొంకటి మహేందర్, నస్పూర్ జోన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి చిరంజీవి, జోన్ కార్యదర్శి సాయి సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






