మంచేరియల్, 9 November
మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలను మరింత విస్తరించేందుకు, మారుమూల ప్రాంతాల రోగులకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో రూ.20 లక్షల నిధులతో సమకూర్చిన కొత్త అంబులెన్సులు, ఆధునిక వైద్య సదుపాయాలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు.
మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలను మరింత విస్తరించి, మారుమూల ప్రాంతాల రోగులకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో రూ.20 లక్షల నిధులతో సమకూర్చిన అంబులెన్సులు, వైద్య సదుపాయాలను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు.
భీమిని, దండేపల్లి, జన్నారం, వేములపల్లి, కోటపల్లి తదితర ప్రాంతాల నుంచి అత్యవసర వైద్య సేవల కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. కాలేజ్ రోడ్డులో నిర్మిస్తున్న నూతన జనరల్ ఆస్పత్రిని త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పాత ఆస్పత్రిలో భవన సమస్యలు, పెచ్చులూడటం, పగుళ్లు వంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, నూతన ఆస్పత్రి అందుబాటులోకి వస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య పరికరాలు, ఆక్సిజన్ స్థాయిలను పర్యవేక్షించే పరికరాలు వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. త్వరలో మెడికల్ కాలేజీ అనుసంధానంతో కాలేజ్ రోడ్డులోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
అప్పటివరకు ప్రస్తుత ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలాంటి వైద్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించడంతోపాటు వైద్యుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.







