సారాంశం
తమ స్వార్థ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సైతం తాకట్టు పెట్టే స్థాయికి రాజకీయ పార్టీలు దిగజారాయని బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ అన్నారు. భారతదేశమంతా 1947లో స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటే, 13 నెలల పాటు నిజాము నవాబు, రజాకార్ల వేధింపులకు గురై, ఆపరేషన్ పోలో ద్వారా స్వేచ్ఛ పొందిన తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను టీఆర్ఎస్ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినం పేరుతో గోల్కొండపై జెండా ఎగరేసి, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను అటకెక్కించిందని ఆయన విమర్శించారు.
ముఖ్య విషయాలు
- 1బిజెపి కేంద్ర ప్రభుత్వం 2023 నుండి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం లేదని తెలిపారు.
- 2భారతదేశమంతా 1947లో స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటే, 13 నెలల పాటు నిజాము నవాబు, రజాకార్ల వేధింపులకు గురై, ఆపరేషన్ పోలో ద్వారా స్వేచ్ఛ పొందిన తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను టీఆర్ఎస్ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినం పేరుతో గోల్కొండపై జెండా ఎగరేసి, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను అటకెక్కించిందని ఆయన విమర్శించారు.
- 3ఓటు బ్యాంకు రాజకీయాల కోసం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఫణంగా పెట్టిన పార్టీలు: బిజెపి
తమ స్వార్థ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సైతం తాకట్టు పెట్టే స్థాయికి రాజకీయ పార్టీలు దిగజారాయని బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ అన్నారు.
- 4ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పేరుతో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు దూరంగా ఉందని, రెండు రాజకీయ పార్టీలు మైనారిటీల సంతృప్తి కోసం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సైతం తాకట్టు పెట్టాయని ఆయన అన్నారు.
తమ స్వార్థ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సైతం తాకట్టు పెట్టే స్థాయికి రాజకీయ పార్టీలు దిగజారాయని బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ అన్నారు. భారతదేశమంతా 1947లో స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటే, 13 నెలల పాటు నిజాము నవాబు, రజాకార్ల వేధింపులకు గురై, ఆపరేషన్ పోలో ద్వారా స్వేచ్ఛ పొందిన తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను టీఆర్ఎస్ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినం పేరుతో గోల్కొండపై జెండా ఎగరేసి, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను అటకెక్కించిందని ఆయన విమర్శించారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పేరుతో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు దూరంగా ఉందని, రెండు రాజకీయ పార్టీలు మైనారిటీల సంతృప్తి కోసం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సైతం తాకట్టు పెట్టాయని ఆయన అన్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం 2023 నుండి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం లేదని తెలిపారు.
బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత గల్లీ గల్లీలో, ప్రతి కార్యాలయంలో, ప్రతి విద్యా సంస్థలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించి, తెలంగాణ విమోచన కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గమ్మ, అశోక్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్, స్టేట్ మీడియా ప్యానలిస్ట్ తుల ఆంజనేయులు తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.