సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జర్నలిస్టుల రక్తదాన శిబిరం నిర్వహణను ప్రశంసించారు. జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరిని వెల్ డన్ యాదగిరి.. గుడ్ జాబ్ అంటూ అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయుడబ్ల్యూజే- ఐజేయు) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరిని అభినందించారు. తానే యాదగిరికి శాలువా కప్పాలని కలెక్టర్ పేర్కొంటూ, శాలువాతో సత్కరించారు. రక్తదాన శిబిరానికి సంబంధించిన ప్రశంసా పత్రాన్ని యాదగిరి కి అందజేశారు. బండారు యాదగిరి జన్మదిన పురస్కరించుకుని, మంగళవారం పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొనాల్సి ఉంది. అయితే, అత్యవసర పనుల కారణంగా ఆయన పాల్గొనలేకపోయారు. దీంతో బుధవారం జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు బండారు యాదగిరి ఆధ్వర్యంలో జర్నలిస్టులు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్‌ను కలిశారు. రక్తదాన శిబిరం ద్వారా సమాజానికి సేవా భావాన్ని చాటి చెప్పడం గొప్ప విషయమని కలెక్టర్ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజానికి మంచి సందేశం వెళుతుందని అన్నారు. ఈ సందర్భంగా టీయుడబ్ల్యూజే- ఐజేయు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి మాట్లాడుతూ, తమ యూనియన్ మొదటి నుంచి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించిందని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.కె. పైసల్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల హక్కులను సాధించడానికి అనేక పోరాటాలు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఈ జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు ప్రభాకర్, చిన్నా మధ్యతరగతి పత్రికల సంఘం ఉపాధ్యక్షుడు నజీర్, కోశాధికారి లక్ష్మణ్, రథసారథి సీఈవో సంతోష్ గౌడ్, శ్రీకాంత్, టీయూడబ్ల్యూజేఐజేయు జిల్లా కార్యవర్గ సభ్యులు ఇర్షాన్, విజయ రాజు, దొంతి మహేష్ గౌడ్, శ్రీకాంత్, సాక్ష్యం శ్రీనివాస్, నవీన్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.












