మంచిర్యాల జిల్లా మండల కేంద్రంలో సోమవారం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు ఒక కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మంచిర్యాల జిల్లా మండల కేంద్రంలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి మొబైల్ ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవద్దని తెలిపారు. అలాగే బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, ఏటీఎం పిన్, పాస్వర్డ్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్లు లేదా లింకులు వచ్చినప్పుడు వాటికి స్పందించకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారా సైబర్ నేరాలను అరికట్టవచ్చని పోలీసులు తెలిపారు.











