సంగారెడ్డి జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పెండింగ్లో ఉన్న నోటీసులు, విచారణలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు లతో కలిసి ఎస్ఐఆర్-2026 ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.











