మంచిర్యాల మున్సిపల్ కార్మికులకు మూడు నెలలుగా నిలిచిపోయిన వేతనాలను చెల్లించాలని కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు. గౌరవ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు మేయర్, కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు సబ్బులు, నూనెలను గౌరవ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, సంఘ గౌరవ అధ్యక్షులు శుద్ధ మల్ల హరికృష్ణ, గౌరవ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.
మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్ శుద్ధ మల్ల హరికృష్ణ మాట్లాడుతూ, కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులలో 60 ఏళ్లు నిండినవారు, భర్తలను కోల్పోయినవారు, వయసు పైబడిన వారి స్థానంలో పనిచేస్తున్న వారికి గత మూడు నెలలుగా వేతనాలు అందడం లేదని తెలిపారు. ఈ సమస్యను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకెళ్లారు.
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తక్షణమే స్పందించి, మేయర్ ధరణి మధుకర్, కమిషనర్ అన్వేష్లకు సూచనలు జారీ చేశారు. కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయించి, కార్మికులకు జీతాలు అందేలా చూడాలని ఆదేశించారు. దీనితో ఈరోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలో మూడు నెలల వేతనాలు చెల్లించాలని తీర్మానం చేశారు.
ఈ నిర్ణయం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గౌరవ మేయర్, కమిషనర్, కార్పొరేటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.


