తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను శనివారం నార్సింగిలోని ఆయన నివాసంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు.
తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను శనివారం నార్సింగిలోని ఆయన నివాసంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్ నమోదు ప్రక్రియ తదితర అంశాలపై కీలక సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో కష్టపడి పని చేయాలని ఆయన సూచించారు. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదు చేసుకునేలా చూడాలని పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ టీపీసీసీకి దసరా శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.












