దసరా పండుగ సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ చిన్నపాప కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు హరీష్ రావుకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
విజయదశమి పర్వదినం ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ ప్రతి ఒక్కరికీ విజయాలను అందించాలని వారు అన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావుతో ఆత్మీయంగా మాట్లాడి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో గుమ్మడిదల మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు చక్రపాణి, కుమార్ గౌడ్, హుస్సేన్, వెంకట్ రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, శేఖర్ రెడ్డి, మహేష్, ఫయాజ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.





