సంగారెడ్డి పట్టణంలోని సహస్ర హాస్పిటల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ, టీహెచ్ఎస్ సేవలతో పాటు నూతన క్యాంటీన్‌ను ప్రారంభించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలనేదే తమ లక్ష్యమని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రాజుగౌడ్ తెలిపారు.
సహస్ర హాస్పిటల్లో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ, టీహెచ్ఎస్ సేవలతో పాటు నూతన క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రాజుగౌడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. రోగులకు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన ఆహార సదుపాయం కల్పించేందుకు క్యాంటీన్‌ను కూడా ప్రారంభించారు. వైద్య సేవలతో పాటు రోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు హాస్పిటల్ యాజమాన్యం కృషి చేస్తుందని తెలిపారు. హాస్పిటల్లో ఉన్న రోగులకు ఉచితంగా భోజనం, వసతి కల్పిస్తామని, నిరుపేద కుటుంబాలకు ఉచిత వైద్య సదుపాయంతో పాటు 24 గంటలూ వైద్య సేవలు అందిస్తామని హాస్పిటల్ చైర్మన్ రాజుగౌడ్ తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద యూరాలజీ, న్యూరాలజీ సేవలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యజమాన్యం నాయకోటి నాగరాజు, పురం సంతోష్, రాము, నాయకులు బుచ్చిరెడ్డి, నక్క నాగరాజు గౌడ్, మాజీ జడ్పీటీసీ మనోహర్ గౌడ్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.


