ఆదిలాబాద్ జిల్లా మండలం అంతర్గాం శివారులో పులి సంచారం కలకలం రేపుతోంది. పులి సంచారం గుర్తించిన స్థానిక రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా మండలం అంతర్గాం శివారులో పులి సంచరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో పులి పాద ముద్రలను గుర్తించిన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందిన వెంటనే అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పులి పాద ముద్రలను గుర్తించిన అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. పొలానికి వెళ్లేటప్పుడు రైతులు గుంపులుగా వెళ్లాలని, సాయంత్రం వేళల్లో త్వరగా ఇంటికి చేరుకోవాలని అధికారులు సూచించారు. పులి సంచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు.











