మంచేరియల్, 11 November
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూ, ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ రాజకీయ దూకుడు పెంచింది. రైతు సదస్సుల వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై , కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధిస్తూ గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. 6 గ్యారెంటీలు420 , ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఆదిలాబాద్, సింగరేణి రామగుండం సభలకు భారీగా ప్రజలు తరలిరావడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది.
సభల విజయవంతానికి జిల్లా మాజీ బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజులుగా సభా ప్రాంగణంలోనే ఉండి నిర్వహణ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. బుధవారం నిర్మల్లో సాయంత్రం 5 గంటలకు జరగనున్న కేటీఆర్ సభను విజయవంతం చేసేందుకు నేతలు కార్యాచరణ సిద్ధం చేశారు.
కోనేరు కోనప్ప, కోవ లక్ష్మి, దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్ రావు, మాజీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్రావు జాన్సన్ నాయక్, జోగు రామన్న తదితర నేతలు ప్రజలను సమీకరించే పనిలో నిమగ్నమయ్యారు.
రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంతో గులాబీ శ్రేణులు రాజకీయ సమరానికి సిద్ధమవుతున్నాయి. వరుస సభలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.







