ఎల్కతుర్తి, 12 November
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, మండలంలోని చింతలపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎంపీటీసీ బొంకూరి కొమురయ్య, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డుకిరే రాజేశ్వరరావు తండ్రి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి నివాసానికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులైన బొంకూరి కార్తీక్ క్రాంతి కుమార్, డుకిరే రాజేశ్వరరావు తదితరులను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.
భగవంతుని కృప వారిపై ఎల్లవేళలా ఉండాలని, బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పిట్టల మహేందర్, పార్టీ సీనియర్ నాయకులు శ్రీపతి రవీందర్ గౌడ్, తంగెడ మహేందర్, మేకల స్వప్న సుదర్శన్, యేల్తూరి స్వామి, సాతూరి చంద్రమౌళి, మునిగడప శేషగిరి, కడారి రాజు, తంగెడ నగేష్, బొంకూరి రజిత, గుండా ప్రతాపరెడ్డి, అంబాల రాజ్ కుమార్, మంకని చేరాలు, సాతూరి శంకర్, మదార్ వేముల శ్రీనివాస్, మేకల బాబురావు, బుసరి శివాజీ, హింగే రమేష్, ఎడ్ల రవీందర్ రెడ్డి, మోరే బాబురావు, సుదర్శన్ మద్దె కుమార్ తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.







