ఎల్కతుర్తి, 12 November
ఎల్కతుర్తి మండలంలోని దామెర, చింతలపల్లి గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబ సభ్యులను సింగిల్ విండో చైర్మన్ ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి బుధవారం పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
మండలంలోని దామెర, చింతలపల్లి గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబ సభ్యులను బుధవారం సింగిల్ విండో చైర్మన్ ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి పరామర్శించి, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముందుగా దామెర గ్రామానికి చెందిన సింగిల్ విండో డైరెక్టర్ మద్దె రాములు తండ్రి మద్దె పెద్ద రాజమౌళి అకాల మరణం చెందడంతో వారి నివాసానికి వెళ్లి, పార్థివదేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, మద్దె పెద్ద రాజమౌళి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అనంతరం చింతలపల్లి గ్రామంలో మాజీ ఎంపీటీసీ బొంకూరి కొమురయ్య అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొమురయ్య కుమారులు బొంకూరి కార్తీక్, బొంకూరి క్రాంతికుమార్లను కలిసి, కుటుంబ పెద్దను కోల్పోవడం బాధాకరమని పేర్కొంటూ వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ బొమ్మలపల్లి అశోక్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు అంబాల శ్రీకాంత్, మాజీ యూత్ అధ్యక్షులు హింగే శ్రీకాంత్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొల్లె పోగు రమేష్ బాబు, వార్డ్ మెంబర్స్ చిలుముల వినోద్ కుమార్, అల్లకొండ బాలస్వామి, అడ్డూరి అనిల్ కుమార్ తదితరులు పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్నారు.







