మంచేరియల్, 12 November
నిర్మల్ వేదికగా నిర్వహించిన బీఆర్ఎస్ రైతు గర్జన సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 6 గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనకు కౌంట్ డౌన్ మొదలైందని ఘాటుగా విమర్శించారు.
నిర్మల్ వేదికగా నిర్వహించిన బీఆర్ఎస్ రైతు గర్జన సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 6 గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనకు కౌంట్‌డౌన్ మొదలైందని ఘాటుగా విమర్శించారు.
కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువేనని మండిపడ్డారు. ప్రాజెక్టులను ఎండబెట్టి తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రైతుబంధు, రైతు భరోసా రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.12 వేలు, కల్యాణలక్ష్మి తులం బంగారం, పింఛన్ల4 వేలు పెంపు వంటి ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచించారని విమర్శించారు.
కేసీఆర్ పాలనలో రైతులకు సాగు పండుగలా ఉండేదని, నేడు అది దండగలా మారిందని అన్నారు. మిషన్ కాకతీయతో6 వేల చెరువుల పునరుద్ధరణ, కాకతీయ, ఎస్సారెస్పీ కాలువల ద్వారా సాగునీటి సరఫరా మెరుగుపరిచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. 60 ఏళ్ల తెలంగాణ గోసను తీర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో మాటల, అంకెల గారడీ తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కలుపు మొక్క కాంగ్రెస్‌ను రాజకీయంగా అంతమొందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రైతు గర్జన సభ విజయవంతం కావడంతో ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సభను విజయవంతం చేసిన గులాబీ శ్రేణులకు అభినందనలు తెలిపిన కేటీఆర్, వారం రోజులుగా సభా ఏర్పాట్లను పర్యవేక్షించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సభకు మంచిర్యాల నుండి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు రాష్ట్ర నాయకులు విజిత్‌రావు నాయకులు పల్లె భూమేష్ ఎడ్ల శంకర్ అత్తి సరోజ తదితరులు పాల్గొన్నారు.







