ఆదిలాబాద్, 12 November
జిల్లాలో దివ్యాంగుల కోటాలో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు శిశు సంక్షేమ అధికారి కాడే మిల్కా ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో దివ్యాంగుల కోటాలో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు శిశు సంక్షేమ అధికారి కాడే మిల్కా ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కలెక్టర్ సమావేశ మందిరం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్సైటు :// అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ఈ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.







