మంచేరియల్, 13 November
మంచిర్యాల జిల్లా తాళ్లపేటలో కాంగ్రెస్ కార్యకర్తలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ భరోసా కల్పించారు. కార్యకర్తలను బెదిరిస్తే సహించేది లేదని, వారికి అండగా తాను, వివేక్ అన్న ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్ అండగా నేను, వివేక్ అన్న ఉంటాం తాళ్లపేటలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంపీ వంశీకృష్ణ భరోసా. మంచిర్యాల: కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తే భయపడేది లేదని, వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. కార్యకర్తల జోలికి వస్తే ముందుగా తనను దాటుకుని వెళ్లాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. కాకా గారి కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందని ఆయన తెలిపారు.







