గుడిహత్నూర్, 13 November
మండలంలో కాంగ్రెస్ పార్టీ తన బలోపేతం కోసం గ్రామ బూత్ లెవల్ కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు మండల నాయకులు తెలిపారు.
మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ బూత్ లెవల్ కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ ఆదేశాల మేరకు ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొడసం దౌలత్ రావు, మోహితే మారుతీ తెలిపారు. ప్రతి గ్రామంలో 21 మంది సభ్యులతో ఈ కమిటీలను ఏర్పాటు చేశామని, ఈ కమిటీలు పార్టీ బలోపేతానికి ఎంతగానో దోహదపడతాయని వారు అన్నారు.







