కొండాపూర్, 14 November
విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ, ప్రతిభావంతులను ప్రోత్సహించడమే లయన్స్ క్లబ్ ప్రధాన ఆశయమని క్లబ్ అధ్యక్షుడు, ముఖ్య అతిథి లయన్ శంకరి విజయేందర్ రెడ్డి అన్నారు.
విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ, ప్రతిభావంతులను ప్రోత్సహించడమే లయన్స్ క్లబ్ ప్రధాన ఆశయమని క్లబ్ అధ్యక్షుడు, ముఖ్య అతిథి లయన్ శంకరి విజయేందర్ రెడ్డి అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆధ్వర్యంలో మండలం గొల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రతిభా పురస్కార కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆదర్శ పూర్వాధ్యక్షుడు లయన్ పర్యాద రామకృష్ణారెడ్డి దాతృత్వంతో, 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులు జి.వేదశ్రీ, టి.శ్రీధర్, ఎం. సుమంత్ లకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉందని, ప్రతి విద్యార్థి కష్టపడి ఇష్టంతో చదువుకొని తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు. దాత పర్యాద రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని, పాఠశాల అభివృద్ధిలోనూ భాగస్వామ్యం అవుతానని తెలిపారు. గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామ ప్రముఖులు లయన్స్ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గడీల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ ప్రియాంక నర్సింలు, వార్డు సభ్యులు ఎల్లయ్య, నవనీత, వీరారెడ్డి, రామాగౌడ్, దావీద్, క్లబ్ అధ్యక్షుడు లయన్ విజయేందర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ చైర్మన్ రామప్ప, క్లబ్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.







