బీజేపీ (అక్షరవేకువ) నవంబర్ 14
భారత్ సమ్మిట్ నిర్వహణను నిరసిస్తూ మంచిర్యాలలో నాయకులు ఆందోళనకు దిగారు. ఐబీ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడంతో పోలీసులు భారీగా మోహరించారు. నిరసనలో పాల్గొన్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల కృష్ణమూర్తి మాట్లాడుతూ, భారత్ సమ్మిట్ నిర్వహణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం సమ్మిట్ నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి ప్రచార ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
నాయకుల నిరసన నేపథ్యంలో ఐబీ చౌరస్తా వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం బిజెపి నేతల ఇళ్ల వద్ద సైతం పోలీస్ దిగ్బంధాలు కొనసాగాయి.




