సంగారెడ్డి, 14 November
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోలీస్ కృష్ణ జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆయనను ఘనంగా సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్, పోలీస్ కృష్ణకు శాలువా కప్పి అభినందించారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లుతూ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు వెంకట్ యాదవ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని పోలీస్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.


