హైదరాబాద్, 15 November
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముదిరాజులంతా ఐక్యంగా కదిలి జాతి అభ్యున్నతికి కృషి చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ జాతి ఆత్మగౌరవం, హక్కుల సాధన, సామాజిక అభివృద్ధి లక్ష్యంగా మహాసభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముదిరాజులంతా ఐక్యంగా కదిలి జాతి అభ్యున్నతికి కృషి చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పిలుపునిచ్చారు. ఆదివారం ఇంటర్వ్యూలో మాట్లాడారు ముదిరాజ్ జాతి ఆత్మగౌరవం, హక్కుల సాధన, సామాజిక అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గతంలో రాష్ట్రవ్యాప్తంగా 300 సంఘాలు ఉండగా వాటిని 500 సంఘాలకు విస్తరించామని పేర్కొన్నారు. మహిళలకు మత్స్యకార ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మహిళలకు రూ.7 కోట్లతో రుణ సదుపాయం కల్పించే ప్రయత్నం చేశామని తెలిపారు. ముదిరాజులకు చేపలు, రొయ్యలు, కొర్రమీను పెంపకం కోసం రూ.75 కోట్ల నిధులు అందేలా కృషి చేశామని వివరించారు. అలాగే 62,500 ద్విచక్ర వాహనాలు, 4 వేలు త్రీ వీలర్ వాహనాలు, 100లా బొలెరో వాహనాలు, సరఫరా వ్యాన్లు, మత్స్యకార వృత్తికి అవసరమైన పనిముట్లు అందేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
ముదిరాజ్ జాతికి ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజని, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంతో పాటు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బండా ప్రకాష్ కోరారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మహాసభ అధ్యక్షులు, కార్యదర్శులు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ప్రతి ముదిరాజ్ కుటుంబం, యువత, మహిళలు, సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జాతి ఐక్యత, ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని కోరారు.







