మంచేరియల్, 16 November
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ) మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గానికి ఘన సన్మానం జరిగింది. జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజు, కార్యదర్శి కె. రమేష్ రెడ్డిలను స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధి లయన్ వి. మధుసూదన్ రెడ్డి సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ) మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గానికి ఘన సన్మానం లభించింది. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆకుల రాజు, కార్యదర్శిగా ఎన్నికైన కె. రమేష్ రెడ్డిలను స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధి లయన్ వి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలను సేకరించి, వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమన్నారు. వార్తల ద్వారా ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పిస్తూ సమాజ అభివృద్ధికి జర్నలిస్టులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు.
వృత్తిపరమైన బాధ్యతలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ జర్నలిస్టులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో నేత్రదాన, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలకు తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో లయన్ ఏ. రాజేశ్వరరావు, లయన్ డేగ బాబు తదితరులు పాల్గొన్నారు.







