పెద్దపల్లి, 17 November
జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లో పెన్షన్ లబ్ధిదారుల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో రాజకీయ వాగ్వాదం చోటుచేసుకుంది. ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రసంగం అనంతరం ఎమ్మెల్యే విజయరమణారావు అనుచరులు ఆయనతో వాగ్వాదానికి దిగారు.
జిల్లా: కాల్వ శ్రీరాంపూర్‌లో నిర్వహించిన పెన్షన్ లబ్ధిదారుల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం రాజకీయ వాగ్వాదానికి వేదికైంది. ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రసంగం అనంతరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయరమణారావు అనుచరులు ఆయనతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.
ఎమ్మెల్యే రాకముందే వేదికపై ఎలా మాట్లాడతారని ఎంపీని ప్రశ్నించినట్లు తెలిసింది. తాను అయ్యప్ప దీక్షలో ఉన్నానని, పూజా కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండటంతో సమయాభావం కారణంగా ముందుగానే ప్రసంగించానని ఎంపీ వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ మాలధారణలో ఉన్న ఎంపీతో అనుచరులు వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశంగా మారింది.
మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన కార్యక్రమం ఆలస్యమవుతుండటంతో మరో కార్యక్రమానికి వెళ్లాల్సి ఉందని, గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశం తనకు లేదని ఎంపీ స్పష్టం చేసినట్లు తెలిసింది.
ఈ ఘటనతో జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రోటోకాల్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.




