సంగారెడ్డి, 17 November
ప్రజలకు ఆధార్ సేవలను మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన యూఐడీఏఐ () ఆధార్ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మంగళవారం ప్రారంభించారు. ఆధార్ కార్డు నేటి రోజుల్లో అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రమని, ప్రభుత్వ పథకాలకు, ఇతర సేవలకు కీలకంగా ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు.
ప్రజలకు ఆధార్ సేవలను మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన యూఐడీఏఐ () ఆధార్ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆధార్ కార్డు నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికీ అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రంగా మారిందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడం, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సేవలను వినియోగించుకోవడం వంటి అనేక అవసరాలకు ఆధార్ కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ఆధార్‌కు సంబంధించిన సేవలు ఒకే చోట సులభంగా అందించాలనే ఉద్దేశంతో ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా ఆధార్ నమోదు, ఆధార్ వివరాల్లో మార్పులు, చిరునామా, మొబైల్ నంబర్, ఇతర వివరాల నవీకరణ వంటి సేవలను నిబంధనల ప్రకారం ప్రజలు పొందవచ్చని తెలిపారు. ప్రత్యేకించి వృద్ధులు, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు ఆధార్ సేవల కోసం ఇబ్బందులు పడకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కేంద్రానికి వచ్చే ప్రజలకు మర్యాదపూర్వకంగా సేవలందిస్తూ, నిర్ణీత సమయంలో వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఆధార్ సేవా కేంద్రంలో అందుబాటులో ఉన్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







