సంగారెడ్డి, 17 November
జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీయూడబ్ల్యుజేఐజేయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఎల్నినో ప్రభావాలపై అవగాహన ర్యాలీని విజయవంతంగా నిర్వహించింది. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఈ ర్యాలీని ప్రారంభించి, జర్నలిస్టుల కార్యక్రమాన్ని అభినందించారు.
జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీయూడబ్ల్యుజేఐజేయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఎల్నినో అవగాహన ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీ విజయవంతంగా జరిగింది. జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి నాయకత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ఐబీ వద్ద జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రారంభించారు. ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో జర్నలిస్టులు, వివిధ రంగాల ప్రముఖులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీకి టీజీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు వైద్యనాథ్, డీపీఆర్ఓ విజయలక్ష్మి తదితరులు మద్దతు తెలిపారు. నీటిని పొదుపు చేద్దాం.. విద్యుత్తును ఆదా చేద్దాం.. అనే నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ... జర్నలిస్టులు కేవలం వార్తలు రాయడానికి మాత్రమే పరిమితం కాకుండా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. ఎల్ నినోపై ఇప్పటివరకు ఇలాంటి కార్యక్రమం ఎవరూ నిర్వహించలేదని అన్నారు. వర్కింగ్ జర్నలిస్టులు తమ వంతు బాధ్యతగా అవగాహన కార్యక్రమాన్ని జరపడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. గ్రామాలు, మండలాల్లో కూడా ఈ అంశంపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం కూడా ప్రజల్లో అవగాహన పెంచేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. అదేవిధంగా విద్యుత్తును కూడా ఆదా చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యుజే ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కె. ఫైజల్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనిల్ కుమార్, రాష్ట్ర నాయకుడు బాసిత్, ఉపాధ్యక్షుడు శ్రీనాథ్, మతీన్, మల్లేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ విల్సన్, జాయింట్ సెక్రటరీ ఉల్లిగడ్డల శివకుమార్, శ్రీనివాసరెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి బసవేశ్వర్, కోశాధికారి సిద్ధూ జైన్, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సిద్ధిక్, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చవాన్, జిల్లా కోశాధికారి లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు నజీర్, ఫోటో జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆరిఫ్, రథసారధి దినపత్రిక సీఈఓ సంతోష్ గౌడ్, సిరి పత్రిక అధినేత శివశంకర్ రావు, పటాన్చెరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పత్తి నరసింహ, ప్రధాన కార్యదర్శి యాదగిరి, ఉపాధ్యక్షుడు రఘురాం రెడ్డి, కోశాధికారి శ్రీనివాస రెడ్డి, కార్యదర్శి శివ, ప్రభాకర్, శ్రీనివాస్, సదాశివపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హాజీ, జహీరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మినాజ్, నేతలు ఇర్షాన్, విజయరాజు, బాలయ్య, శివన్న జైన్, కొంకా రాజేశ్వర్, శ్రీకాంత్, మహేష్ గౌడ్, కొండాపూర్ రమేష్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, మాచర్ల సతీష్ కుమార్, పౌర సమాజం నుంచి పోతే దార్ మనోహర్, జోగన్న గారి యాదగిరి, పోలీస్ సతీష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.






