గూడెం, దండేపల్లి (అక్షరవేకువ) నవంబర్ 18
దండేపల్లి మండలంలోని గూడెం గ్రామంలో ఇరికిల్ల తేజ రవి తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా 16 మంది చిన్నారులకు పలకలను పంపిణీ చేశారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
దండేపల్లి మండలంలోని గూడెం గ్రామంలో ఇరికిల్ల తేజ రవి తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా 16 మంది చిన్నారులకు పలకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మతపరమైన ప్రదేశాలు, వివాహ సేవా ప్రదాతల భాగస్వామ్యంతో బాల్య వివాహాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఫంక్షన్ హాళ్లు, బ్యాండ్ పార్టీలు, క్యాటరర్లు, టెంట్ హౌస్ నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించనున్నారు.
మత పెద్దల ద్వారా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయించడంతో పాటు, వివాహ సేవా ప్రదాతలతో బాల్య వివాహాలను ప్రోత్సహించబోమని ప్రతిజ్ఞ చేయించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఐఈసీ ప్రచార సామగ్రి ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు.
బాల్య వివాహాల నివారణకు మత పెద్దలు, ఫంక్షన్ హాల్ నిర్వాహకులు, వివాహ సంబంధిత సేవా ప్రదాతలు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరారు.
ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయురాలు అరుణ, అంగన్వాడీ టీచర్లు చంద్రకళ, లక్ష్మి, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.







