సిద్దిపేట, 18 November
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న కాంగ్రెస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పీసీసీ కోఆర్డినేటర్ ప్రశాంత్ రెడ్డి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. గురువారం సిద్దిపేట బైపాస్ రోడ్డులోని నాగదేవత ఆలయం సమీపంలో నిర్వహించనున్న ఈ సభ ఏర్పాట్లను బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర బీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో ఏర్పాట్ల సమాచారాన్ని చేరవేస్తూ సమన్వయం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి సతీష్ గౌడ్, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఇందిరమ్మ బీమా పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి.







