సిద్దిపేట, 18 November
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న కాంగ్రెస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పీసీసీ కోఆర్డినేటర్ ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. గురువారం సిద్దిపేట బైపాస్ రోడ్డులోని నాగదేవత ఆలయం సమీపంలో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు.
రాష్ట్ర పిసిసి కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో ఏర్పాట్ల సమాచారాన్ని చేరవేస్తూ, సమన్వయం చేస్తున్నారు. మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలు సభ విజయవంతానికి ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తూ, పర్యవేక్షిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి సతీష్ గౌడ్, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఇందిరమ్మ బీమా పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, సభ ఏర్పాట్లను సమన్వయం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేస్తున్నాయి.







