సంగారెడ్డి, 18 November
బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డికి బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కొత్తపల్లి జ్యోత్స్న, బీజేపీ నాయకులు కొత్తపల్లి అశోక్ బుధవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్రపురంలోని ఆమె నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డికి బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కొత్తపల్లి జ్యోత్స్న, బీజేపీ నాయకులు కొత్తపల్లి అశోక్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం రామచంద్రపురంలోని ఆమె నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడు గోదావరి అంజిరెడ్డికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా కొత్తపల్లి జ్యోత్స్న, కొత్తపల్లి అశోక్ ఆకాంక్షించారు.







