మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 24
స్థానిక మంచిర్యాల పట్టణంలో బిజెపి నేత ముల్కల మల్లారెడ్డి నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీ అంజి రెడ్డి, ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మల్లారెడ్డి పార్టీకి చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు.
స్థానిక మంచిర్యాల పట్టణంలోని ముల్కల మల్లారెడ్డి నివాసానికి ఎమ్మెల్సీ అంజి రెడ్డి గారు విచ్చేసి, వారి పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజి రెడ్డి మాట్లాడుతూ, ముల్కల మల్లారెడ్డి 2013లో భారతీయ జనతా పార్టీలో చేరారని, 2014లో బిజెపి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి, పార్టీకి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఇక లేరనే వార్తతో భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద నాయకుడిని కోల్పోయిందని అన్నారు.
మల్లారెడ్డికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు, బిజెపి జాతీయ బీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ కూడా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ముల్కల మల్లారెడ్డి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.












