మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 23
మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం డీసీపీ ఏ భాస్కర్ నేతృత్వంలో పోలీసులు జువెల్లరీ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. దొంగతనాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై షాపు యజమానులకు పలు కీలక ఏ భాస్కర్ సూచనలు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు, నిఘా వ్యవస్థ పటిష్టత వంటి అంశాలపై దృష్టి సారించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ నేతృత్వంలో ఎసిపి ప్రకాష్, సీఐ ప్రమోద్ రావు, ఎస్ఐల బృందం జువెలరీ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను బరువుగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకోకపోతే దొంగతనాలు జరిగే అవకాశం ఉందని షాపు యజమానులకు సూచనలు చేశారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, రోడ్లపై కదలికల పుటేజ్ తప్పనిసరిగా ఉంచుకోవాలని, చుట్టుపక్కల షాపులకు లహరి భద్రత కల్పించాలని సూచించారు. పోలీసుల పెట్రోలింగ్, గస్తీలు చేస్తామని తెలిపారు. మూడు రాష్ట్రాలకు కనెక్టివిటీగా మంచిర్యాల ఉండటంతో అంతరాష్ట్ర దొంగల చోరీలకు ఆస్కారం ఉందని, తగు జాగ్రత్తలు తీసుకోవడమే శ్రీరామరక్ష అని అన్నారు.
సీపీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా బ్యాంకులు, లాడ్జిలు, రెసిడెన్సీలు, హోటళ్లు, జనసంద్రత ఎక్కువగా ఉండే చోట్ల సీసీ కెమెరాల వినియోగ ప్రాధాన్యతను తెలియజేశారు. భద్రతను రక్షణగా చేసుకొని కర్తవ్యం సక్రమంగా నిర్వహిస్తే అనుమానితుల కదలికలపై సమాచారం అందించాలని కోరారు.
ఈ సోదాలు ముగ్గురం చౌరస్తా, ఆర్పీ రోడ్లలోని షాపుల్లో నిర్వహించారు. ఏదైనా అనుమానాస్పద కదలికలు ఉంటే వెంటనే 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.












