మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 25
మమషఫఫూేపఉదమచబషేమఘపపచచ.మచమగళహచబపమ108ఈపపచచ.బషేమమచేేమచ.
మండల్ కమిషన్ సిఫార్సులను అందించడం ద్వారా దేశవ్యాప్త బీసీ వర్గాల సంక్షేమానికి పునాదులు వేసిన బిందేశ్వరీ ప్రసాద్ మండల్ స్ఫూర్తితో నేటి ప్రజలు ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం రోజున మంచిర్యాల చార్వాక ట్రస్ట్ హాల్లో బీపీ మండల్ 108వ జయంతి సభను వారు నిర్వహించారు.
అమలు కాని సిఫార్సులుపై ఆవేదన
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వర గౌడ్ ప్రసంగిస్తూ, మండల్ మహనీయుడు ఎంతో పరిశోధన చేసి అందించిన సిఫార్సులలో కేవలం రెండింటిని మాత్రమే నేటికీ అమలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం చేపట్టిన ఆధిపత్య వర్గాలు బీసీల ఆకాంక్షలను పూర్తిగా అమలు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు.
బీపీ మండల్ పోరాట స్ఫూర్తి
ఆధిపత్య వర్గాల వివక్షను ఎదుర్కొని బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బీపీ మండల్ దేశానికే ఒక కొత్త మార్గాన్ని చూపారని తెలిపారు. మండల్ రెండవ దశ ఉద్యమం నేడు జరగాల్సిన అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు.
కులగణనపై విమర్శలు
ప్రస్తుతం మోడీ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పుల తడకగా సాగుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ, బీహార్లలో జరిగినట్లుగా కులాల పట్టికను రూపొందించి, ప్రతి కులానికి ఒక సంఖ్యను కేటాయిస్తేనే సమగ్ర కుల గణన సాధ్యమని ఆయన తెలిపారు. మోడీ ప్రభుత్వం పెద్దలు దురుద్దేశంతో దీనిని తప్పుల తడకగా మారుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
బీసీల ఉద్యమ పిలుపు
కులగణన సక్రమంగా జరిగేలా దేశవ్యాప్తంగా బీసీలు ఉద్యమించి, మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, మార్కండేయ గౌడ్, రాజేశం గౌడ్, సమ్ము రాజన్న, మొగిలి తిరుపతి, శ్రీనివాస్ గౌడ్, కార్తీక్, లింగమూర్తి, సాయికుమార్, చరణ్, రాజు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.












