సంగారెడ్డి, 2026-08-26
ఈద్ మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త మహమ్మద్ (స) అందించిన సందేశాలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు.
ఈద్ మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రవక్త మహమ్మద్ (స) ప్రపంచానికి అందించిన ప్రేమ, కరుణ, దయ, సహనం, సోదరభావం వంటి గొప్ప సందేశాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
ప్రవక్త మహమ్మద్ (స) జీవితం యావత్ మానవాళికి మార్గదర్శకమని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలంతా ఒకరి మత విశ్వాసాలు, ఆచార సంప్రదాయాలను మరొకరు గౌరవించుకుంటూ, పరస్పరం సహకరించుకుంటూ ఐక్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ముఖ్యంగా యువత మంచి ఆలోచనలతో ముందుకు సాగుతూ, సమాజంలో శాంతి, మత సామరస్యం, సోదరభావం, మానవత్వం పెంపొందించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఇంటా ఆనందం, శాంతి, సుఖ సంతోషాలు నింపాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకాంక్షించారు.












