సంగారెడ్డి, 2024-08-29
క్యాన్సర్ రోగులకు అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా యశోద ఆసుపత్రి ముందుకు సాగుతోందని సోమాజిగూడ యశోద ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ ఆంకాలజీ, లాపరోస్కోపిక్, రోబోటిక్ ఆంకో సర్జన్ డాక్టర్ వై.యుగంధర్ తెలిపారు. ఆధునిక శస్త్రచికిత్సా విధానాలతో క్యాన్సర్ చికిత్సా సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని ఆయన చెప్పారు.

శనివారం సంగారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం క్యాన్సర్ సర్జరీలో సాంకేతికంగా గణనీయమైన పురోగతి సాధించామని తెలిపారు. ముఖ్యంగా లాపరోస్కోపిక్, రోబోటిక్ అసిస్టెడ్ శస్త్రచికిత్సల వినియోగం పెరుగుతోందన్నారు. ఈ ఆధునిక విధానాల ద్వారా చిన్న కోతలతోనే క్లిష్టమైన శస్త్రచికిత్సలను నిర్వహించే అవకాశం ఉందని వివరించారు.
క్యాన్సర్ కణతులను సమర్థవంతంగా తొలగించడంతో పాటు రోగులు త్వరగా కోలుకునేలా ఆధునిక చికిత్సా విధానాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. క్యాన్సర్ రోగులకు యశోద ఆసుపత్రిలో నిపుణుల పర్యవేక్షణలో అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో సంజీవ్ కుమార్, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.