సంగారెడ్డి, 10 September
వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం ఆమె జిల్లా అదనపు కలెక్టర్ పాండు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె ధైర్యసాహసాలు, అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం సమాజానికి ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఆయన అన్నారు.
వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్ పక్కన ఉన్న చాకలి ఐలమ్మ జిల్లా అదనపు కలెక్టర్ పాండు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలకు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటానికి సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు. ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆమె చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్, యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణు, జిల్లా అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.











