దండేపల్లి, 2024-08-31
దండేపల్లి మండల తహసీల్దర్ రోహిత్ దేశ్ పండే ఉత్తమ తహసీల్దర్ అవర్డు అందుకోవడం పట్ల స్థనిక ఆదివసి పటేళ్లు ఆయనను కుం సన్మనించరు. ఈ సందర్భం కర్యలయంలో ప్రత్యేక కర్యక్రమం నిర్వహించరు.
దండేపల్లి మండల తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండే కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ తహసీల్దార్ అవార్డు అందుకున్న సందర్భంగా, దండేపల్లి మండల ఆదివాసి పటేళ్ల ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఆయనను ఘనంగా శాలువా కప్పి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆత్రం జలపతి, మర్సుకోల సంతోష్, కోవా తిరుపతి, కోట్నాక మాన్కు, పెంద్రంశ్రీనివాస్, కుమరం అనంత్, కుమురం లాల్ షావ్, మందాడి లచ్చు పటేళ్లు పాల్గొన్నారు.











