26 నవంబర్ 26 అక్షరవేకువ (అక్షరవేకువ) నవంబర్ 26
ధర్మారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను సర్పంచ్ దాసరి మణిదీపక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ ను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను, రాజ్యాంగ స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ దాసరి మణిదీపక్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కేవలం ఒక గ్రంథం కాదు.. అది ప్రతి భారతీయుడి హక్కులకు రక్షణ కవచం, ప్రతి పౌరుడి ఆత్మగౌరవానికి ప్రతీక, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి పునాది అని పేర్కొన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ విద్య, ఐక్యత, సమానత్వం, సోదరభావం అనే విలువలను ఆచరణలో పెట్టాలని సర్పంచ్ అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పిస్తూ గ్రామాభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగం మనకు హక్కులను కల్పించడమే కాకుండా సమాజం పట్ల బాధ్యతలను కూడా గుర్తు చేస్తుందని, రాజ్యాంగ స్ఫూర్తిని భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అని సర్పంచ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సమానత్వమే సమాజానికి పునాది. రాజ్యాంగమే ప్రజాస్వామ్యానికి ప్రాణం. అంబేద్కర్ ఆశయాలే అభివృద్ధి చెందిన భారతదేశానికి మార్గదర్శకం.






