హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోలీసులు చేపట్టిన వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఒక వ్యక్తిని గుర్తించి, అతనిపై కేసు నమోదు చేశారు.
ఎల్కతుర్తి ఎస్ఐ నరసింహరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో, నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ నరసింహరావు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం తీవ్రమైన నేరమని, ఇది తమతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదకరమని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ప్రజలకు ఆయన సూచించారు.
ప్రమాదాలను నివారించడానికి, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ఇలాంటి తనిఖీలను నిరంతరం కొనసాగిస్తారని ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో పలువురు ఎడ్కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.







