పర్యావరణ పరిరక్షణ సమితి, పర్యావరణ దినోత్సవం సందర్భంగా కుక్కలు మరియు కోతులకు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేసింది.
ఈ సమితి, పర్యావరణ సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వారు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.
కుక్కలు మరియు కోతుల దాడుల వల్ల ప్రజలు భయంతో బ్రతుకుతున్నారని, ముఖ్యంగా స్కూలు పిల్లలు ప్రభుత్వ స్కూల్లోకి వెళ్లలేక పోతున్నారని వారు చెప్పారు.
అలాగే, ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వలన మురికి కాలువలు, చెరువులు మరియు కుంటలు నిండిపోతున్నాయని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు.












